AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. లాడ్జిలో ఉరేసుకుని ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేఎన్ఆర్ లాడ్జిలో బస చేసిన ఆర్మీ జవాన్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతుడు నాతవరం మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్స శివ అప్పలనాయుడుగా గుర్తించారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.