సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు ఏర్పాట్లు

555చూసినవారు
సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రోజున శ్రీశైలంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల శ్రీశైలం అడవులను గ్రేహౌండ్స్, బాంబుస్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. శ్రీశైలం ఆలయం, జలాశయం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా పరిశీలించారు. అనంతరం సుండిపెంట ప్రజావేదిక, హెలిప్యాడ్ ప్రాంతాలను వారు పరిశీలించారు. సీఎం పర్యటన విజయవంతం అయ్యేలా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్