అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తమ దేశంలో స్త్రీ, పురుష జెండర్లనే గుర్తించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు అధికారిక పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల చట్టాలను ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీ నేతలు వ్యతిరేకించడం వివాదాస్పదంగా మారింది. ఇదే సమయంలో తాజా ప్రకటన చర్చనీయాంశమైంది. ఇక మిలటరీలో ట్రాన్స్‌జెండర్ దళాలపై బ్యాన్ విధించడంతో వారి నియామకాలను ఆపేశారు.