AP: రేపు (గురువారం) ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉ.8 నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ చేపట్టనున్నారు.