మహారాష్ట్ర ముఖ్య మంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ పేరును బీజేపీ ఖరారు చేసింది. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ నేతలు సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఫడణవీస్ పేరును ప్రతిపాదించగా, మిగతా సభ్యులంతా ఆమోదించినట్లు సమాచారం. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కాగ రేపు మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.