ఏలూరు జిల్లా పోలవరం
జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కారులో ఇంటికి వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బర్రిలంకలపాడు సమీపంలో దాడి జరిగింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.