పాన్ ఇండియా హీరో యష్ నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రాబోతుంది. ఈ విషయాన్ని రాకింగ్ స్టార్ యష్ ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా జనవరి 8న 10.25 గంటల సినిమా నుంచి అప్డేట్ రాబోతోన్నట్లు యష్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.