ఆలయాలపై దాడులు పెరిగాయి: పురందేశ్వరి

84చూసినవారు
ఆలయాలపై దాడులు పెరిగాయి: పురందేశ్వరి
AP: విజయవాడలో హైందవ శంఖారావం సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొని మాట్లాడారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఆమె అన్నారు. ఆలయాలకు రక్షణ కల్పించాలని, హిందూ ధర్మం, సంప్రదాయాలను కాపాడాలని కోరారు. ధార్మిక క్షేత్రాల్లో అన్యమతస్థులు పెరిగారని, వారిని నియంత్రించాలన్నారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు తాము పోరాడుతామన్నారు.

సంబంధిత పోస్ట్