AP: సినీ నటి మాధవీలతపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా స్పందించారు. తాను ఆవేశంలో నటి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశానని, అందుకు ఆమెకు క్షమాపణ చెబుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తనపై విమర్శలు చేసిన బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు.