జాతిపితపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సింగర్ అభిజీత్ భట్టాచార్యకు లీగల్ నోటీసులు

84చూసినవారు
జాతిపితపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సింగర్ అభిజీత్ భట్టాచార్యకు లీగల్ నోటీసులు
సింగర్ అభిజీత్ భట్టాచార్యకు పూణేకు చెందిన ఓ న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ పాకిస్థాన్‌కు జాతిపిత అని మన దేశానికి కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో న్యాయవాది అసిమ్ సోర్డే తన క్లయింట్ మనీష్ దేశ్‌పాండే తరపున లీగల్ నోటీసులు పంపారు. భట్టాచార్య వెంటనే క్షమాపణలు చెప్పాలని లేకపోతే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్