సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం (వీడియో)

64చూసినవారు
TG: కొమురం భీమ్ ఆసీఫాబాద్ జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కౌటాల మండలం బోదంపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. ఇటీవలే ఆ ప్రేమ బ్రేక్అప్ కావడంతో.. మనస్తాపానికి గురైన వెంకటేష్ ఆదివారం ఓ సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్