కొరిశపాడు మండలం కొరిశపాడులోని ప్రాథమిక పాఠశాల నందు అంగన్వాడి శాఖ ఆధ్వర్యంలో శనివారం భేటీ పచ్చావో. భేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి పాల్గొని బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించాలని అన్నారు. ఎవరైనా తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.