కొరిశపాడు మండలంలోని కొరిశపాడు గ్రామానికి మంచినీటిని అందించే ట్యాంక్ ప్రధాన పైపు గత 4 నెలలుగా పగిలిపోవడంతో నీరు వృధాగా పోతోందని గ్రామస్తుడు గోలి సురేష్ గురువారం తెలిపారు. ట్యాంక్ నుండి నీరు పోతున్నా అధికారులు స్పందించలేదు. పలు సార్లు అధికారులకు తెలియజేసినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులు సమస్యపై త్వరగా చర్య తీసుకోవాలని కోరుతున్నారు.