విద్యుత్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఇ

74చూసినవారు
విద్యుత్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఇ
సంతమాగులూరు మండలం సంతమాగులూరు లోని విద్యుత్ కార్యాలయాన్ని గురువారం సబ్ డివిజన్ డిఇ సురేంద్ర తనిఖీ చేశారు. మండలంలో జరుగుతున్న విద్యుత్ సరఫరా, నూతన విద్యుత్ కనెక్షన్లు మంజూరు తదితర అంశాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. మండలంలో మంజూరు చేసిన 650 మంది రైతులకు నూతన విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్లు వారు డిఇ కి తెలియజేశారు. విద్యుత్ శాఖపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్