బాపట్ల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడిను అద్దంకి మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ పరిశీలకులు బాచిన గరటయ్య సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని గరటయ్య తెలియజేశారు. ఎస్పె ని కలిసిన వారిలో బల్లికురవ మండల పార్టీ అధ్యక్షులు చింతల పేరయ్య తదితరులు ఉన్నారు.