గుజరాత్‌లో 10 ఏళ్ల బాలిక 16 ఏళ్ల బాలుడితో పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం పెంచుకున్నారు. 5వ తరగతి చదువుతున్న బాలిక డిసెంబర్ 31న ధన్సురా గ్రామంలోని తన ఇంటి వద్ద నుంచి కనిపంచకుండా పోయింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే పోలీసులు వీరిని సమీప గ్రామంలో పట్టుకున్నారు. తరువాత వారిని జువైలన్ హోంకు తరలించారు.