కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సోమవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ఎం.పీ. డీ. వో రాజ్యలక్ష్మి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పాఠశాల విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని ఆమె తెలిపారు.