పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

55చూసినవారు
పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ
కొరిశపాడు మండలం దైవాల రావూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ పున్నయ్య శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరు పట్టిని ఆయన పరిశీలించారు. విద్యార్థులచే పాఠ్యాంశాలను చదివించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పాఠశాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను విద్యార్థులు చక్కగా చదువుతున్నారని ఎంఈఓ పున్నయ్య తెలియచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్