బాపట్ల ఎంపీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. పార్లమెంటు పరిధిలోని ప్రజలు ప్రజా దర్బారులో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించారు. అర్జీలను పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపి సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని కార్యాలయ సిబ్బందికి ఆయన సూచించారు.