చిలకలూరిపేట షెడ్యూల్ కులాల రిజర్వేషన్లలో వర్గీకరణ ఉండాలని మూడు దశాబ్దాల పైగా చేసిన పోరాటాలు ఫలించాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ అన్నారు. పట్టణంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిలతో కూడిన దర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడం ద్వారా లక్షలాదిమంది మాదిగ కులస్తులకు, 59 ఉప కులాలకు మేలు జరగబోతుందని తెలిపారు.