రాష్ట్రంలోనే ఆదర్శ నియోజవర్గంగా చిలకలూరిపేటను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం చిలకలూరిపేట పండరీపురంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయమ్మ ఆస్పత్రిలో ఓయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆర్ధిక సాయం, మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన పంపిణీ చేశారు.