కనపర్రు పంచాయతీ మల్లాయపాలెం గ్రామంలో గురువారం బాలల దినోత్సవం, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారు దేశ భవిష్యత్తు మార్గనిర్దేశకులని, వారికి స్వేచ్ఛనిచ్చి ఎదుగుదలకు కృషి చేయాలని కనుపర్రు పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జజ్జర సోమరాజు తెలిపారు.