చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కంటే మిన్నగా వ్యవహరించాలని, ప్రతి విద్యార్థిని తమ సొంత బిడ్డలానే చూడాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. సోమవారం ఆయన పురుషోత్తం పట్నంలోని మున్సిపల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలను అభివృద్ధి చేయాలని ఉపాధ్యాయులు మాజీ మంత్రిని కోరారు. వారి విజ్ఞప్తిని తప్పకుండా పరిశీలిస్తానని చెప్పారు.