సంక్షేమం-అభివృద్ధి మేళవింపుగా ప్రజా పాలన అందిస్తామన్న కూటమి ప్రభుత్వ నినాదానికి నిదర్శనమే రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో శనివారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కనపర్రులో రూ. 20లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.