యడ్లపాడు: గోడ దూకి పారిపోయిన విద్యార్థులు

78చూసినవారు
యడ్లపాడు: గోడ దూకి పారిపోయిన విద్యార్థులు
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంలోని గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులు పారిపోయారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. పారిపోయిన విద్యార్థుల్లో జ్యోతి కిరణ్, దానియేలు, అఖిల్, నాగేశ్వరరావులను కొంత దూరంలో గురుకుల పాఠశాల పీడీ పట్టుకొని తీసుకొచ్చారు. మరో ముగ్గురు విద్యార్థులు మహేష్, అజయ్, శశి ఇంకా పాఠశాలకు చేరుకోలేదు. వారు అదే మండలంలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్లినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్