చీరాల: హైడ్రాలిక్ పైపు లీక్.. రహదారిపై తప్పిన పెను ప్రమాదం

70చూసినవారు
బాపట్ల జిల్లా చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై వాహనదారులకు పెను ప్రమాదం తప్పింది. చీరాల నుండి కారంచేడు కు ఫ్లైఓవర్ మీద వెళ్తున్న ఓ ట్రాక్టర్ నుండి హైడ్రా లిక్ పైపు లీకు కావడంతో రహదారిపై ఆయిల్ పడింది. దీంతో అటుగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుల బైక్లు ఒకసారి స్కిడ్ అవ్వడంతో అదుపు తప్పి పడిపోయారు. ఎవరికి ఏటువంటి గాయాలు కాకపోడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్