చీరాల: ఇసుక దందాకు నిరసనగా ప్రజా సంఘాల ఆందోళన

77చూసినవారు
చీరాల నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా ఇసుక దందా సాగుతోందని ఆరోపిస్తూ ప్రజాసంఘాల నాయకులు ఆదివారం క్లాక్ టవర్ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాపట్ల ఎంపీ, చీరాల ఎమ్మెల్యే అనుచర గణమే ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా సాగిస్తోందని ఈ సందర్భంగా వారు మీడియాకు చెప్పారు. వీరి మధ్య ఆధిపత్య పోరు ఫలితంగానే తోటవారిపాలెంలో జెసిబి దగ్ధం ఘటన జరిగిందన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా నిద్ర మత్తు వీడాలన్నారు.

సంబంధిత పోస్ట్