గురుపూజోత్సవం సందర్భంగా గురువారం బాపట్లలోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో.. చీరాల మండలం జాండ్రపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు పూర్ణచంద్రరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణ రావు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.