చీరాల మండలం ఈపూరుపాలెం స్ట్రైయిట్ కట్ కాలువ చివర అడవి పల్లెపాలెం వద్ద ఇంటర్ నెట్ కేబుల్ లాగుతు గురువారం రాత్రి ఇరువురు యువకులు ప్రమాదవశాత్తూ కాలువలో పడ్డారు. దీనిని గమనించిన స్థానిక మత్స్యకారులు శ్రీనివాసరెడ్డిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చీరాల శ్రీనివాస నగర్ కు చెందిన సాయి అనే యువకుడు కాలువలో గల్లంతయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.