రేపు గుంటూరులో అన్న క్యాంటీన్లు ప్రారంభం

55చూసినవారు
రేపు గుంటూరులో అన్న క్యాంటీన్లు ప్రారంభం
గుంటూరు పట్టణంలో అన్న క్యాంటీన్లు శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రజా ప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో 7 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు జీఎంసీ చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రతి అన్న క్యాంటీన్లో ప్రభుత్వ నిర్దేశిత మెనూ ప్రకారం సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్