17న నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ: విజయలక్ష్మి

58చూసినవారు
17న నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ: విజయలక్ష్మి
జాతీయ నులి పురుగుల నివారణ దినం సందర్భంగా ఈ నెల 17న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమం జరుగుతుందని జిల్లా వైద్యశాఖ అధికారి విజయలక్ష్మి శుక్రవారం వెల్లడించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం 1-2 సంవత్సరాల వయసు వారికి ఆల్బెండ జోల్ అరమాత్ర, 2-19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్