జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల్లో అమరులైన ఇద్దరు సైనికులు

54చూసినవారు
జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల్లో అమరులైన ఇద్దరు సైనికులు
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారని భారత సైన్యం తెలిపింది. ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారంతో కిష్త్వార్‌లోని చత్రూ ప్రాంతంలో J&K పోలీసులతో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించినట్లు సైన్యం తెలిపింది. ఈ సందర్భంగా చెలరేగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్