గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆసుపత్రి ఇన్ ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ బాబు గురువారం తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును అత్యవసరంగా అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. రోగులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఈ వార్డుకు తరలించి వైద్య సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.