గుంటూరు: నాలుగేళ్ల పాప అదృశ్యంపై కేసు నమోదు

77చూసినవారు
గుంటూరు: నాలుగేళ్ల పాప అదృశ్యంపై కేసు నమోదు
మూడావత్ తేజశ్విని అనే నాలుగేళ్ల పాప తప్పిపోయినట్లు లాలాపేట పోలీస్ స్టేషన్ లో సోమవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 9వ తేదీ జిన్నాటవర్ సెంటర్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి తేజశ్విని తల్లిదండ్రులు తీసుకొని వచ్చారని, ఈ క్రమంలో ఆ చిన్నారి తప్పిపోయిందని చెప్పారు. తండ్రి రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, తప్పిపోయిన చిన్నారి ఎరుపురంగు గౌను ధరించి ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్