అహంకారంతో రాజ్యాలను గెలవలేం అని, శాంతి, సహనం ద్వారానే ప్రజల మనస్సులు గెలవొచ్చని ప్రభువైన ఏసు నిరూపించారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రార్థనా మందిరాల్లో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాధవి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.