రేపు గుంటూరు జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు: కలెక్టర్

73చూసినవారు
రేపు గుంటూరు జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు: కలెక్టర్
గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం దృష్ట్యా జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ సెలవు ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలలు కూడా నిర్వహించకూడదని, విధిగా సెలవును అమలు చేయాలని ఆమే కోరారు.

సంబంధిత పోస్ట్