అన్న క్యాంటీన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. గుంటూరు నల్లచెరువులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్లను నడుపుతుందని సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారికి క్యాంటీన్లు ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.