బోరుగడ్డ అనిల్ ను అందుకే అరెస్ట్ చేశాం: గుంటూరు ఎస్పీ

81చూసినవారు
బోరుగడ్డ అనిల్ ని అరెస్ట్ చేయడానికి గల కారణాలను గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ గురువారం మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ 2021లో ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి రూ. 50లక్షలు లాక్కున్న కేసులో ప్రస్తుతం అరెస్ట్ చేశామన్నారు. అనిల్ పై మొత్తం 17 కేసులుండగా వాటిలో 15 యాక్టివ్ గా ఉన్నాయని చెప్పారు. సోషల్ మీడియాను అందరూ జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్