గుంటూరులో వైభవంగా వరలక్ష్మి వ్రతం

77చూసినవారు
శ్రావణమాసం రెండవ శుక్రవారం వేడుకలు గుంటూరులో వైభవంగా జరిగాయి. శుక్రవారం నగరంలోని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేపట్టారు. అదేవిధంగా సామూహిక కుంకుమార్చన కూడా జరిపారు. కుటుంబ సమేతంగా దైవ దర్శనం గావించి, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. పవిత్ర శ్రావణమాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్