అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటపడాలని కోరుకుంటూ క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా పెట్టే ఖర్చులను సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నట్లు గుంటూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పారు. పాత బస్టాండ్ చర్చి వద్ద మంగళవారం అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పేదలకు ఆహారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫరీద్ భాషా, బాబి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.