ఒంటరిగా పొలానికి వెళ్లిన ఓ మహిళపై పక్క పొలానికి చెందిన రైతు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రూరల్ కు చెందిన మహిళ ఈనెల 15న తన పొలంలో పనులకు వెళ్లగా పక్క పొలానికి చెందిన తోకల శివనాగమల్లేశ్వరరావు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.