గుంటూరులో మానవతా సంస్థ ఆధ్వర్యంలో క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 194వ జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఆమెను "చదువుల తల్లి" గా ప్రశంసిస్తూ మహిళా అధ్యాపకులను సత్కరించారు. వక్తృత్వం, వ్యాస రచన పోటీలను నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. మానవతా సభ్యులు, విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.