జిల్లాలో రూ. 13. 73 కోట్లతో 160 అభివృద్ధి పనులు: గుంటూరు కలెక్టర్

68చూసినవారు
జిల్లాలో రూ. 13. 73 కోట్లతో 160 అభివృద్ధి పనులు: గుంటూరు కలెక్టర్
పల్లె పండుగ - గ్రామ పంచాయితీ వారోత్సవాలలో భాగంగా గుంటూరు జిల్లాలో రూ. 13. 73 కోట్ల నిధులతో 160 అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. మంగళవారం పొన్నూరు నియోజకవర్గంలో పల్లె పండుగ- గ్రామ పంచాయితీ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే- ధూళిపాళ్ళ నరేంద్రతో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో వేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్