దౌర్జన్యాలు, రౌడీయిజాన్ని సహించేది లేదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. ఒక అపార్టుమెంట్లో క్రాకర్స్ తమ ఇంటిపై పడ్డాయని కొంతమంది వ్యక్తులతో కలిసి కాకర నరేంద్రరెడ్డి ఎదురు ఇంటి వారిపై దాడికి పాల్పడిన ఘటనలో నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు.