తనపై షాపు యజమాని అసభ్యంగా ప్రవర్తించాడని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఓ యువతి మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కిరీటి అనే వ్యక్తి వద్ద బాధితురాలు పనిచేస్తుంది. ఈనేపథ్యంలో యువతి పట్ల షాపు యాజమాని అసభ్యంగా ప్రవర్తించాడని యువతి ఫిర్యాదు చేశారు. తండ్రి లేని తనను వేధించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.