గుంటూరు మేయర్ మనోహర్ నాయుడిపై కేసు నమోదు
వైసీపీ నేత, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిపై ఆదివారం కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు అరండల్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో టీడీపీ, జనసేన నేతలు నిరసన తెలిపారు. వారిపై మనోహర్ నాయుడు దురుసుగా ప్రవర్తించి, చంద్రబాబు, పవన్ ను దూషించారు