రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మాజీ మంత్రి విడదల రజనీ ధ్వజమెత్తారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా మహిళా కార్యకర్త సుధారాణితో గుంటూరు సబ్ జైలు వద్ద సోమవారం మధ్యాహ్నం రజనీ మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళి తెలంగాణాలో జీవిస్తున్న సుధారాణిని పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని రజిని ధ్వజమెత్తారు.