పార్టీ అంశాలు, వ్యక్తి గత అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయడానికి వ్యక్తి గత యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించానని మాజీమంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. శనివారం గుంటూరు సిద్ధార్థ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో అంబటి మాట్లాడారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలనే ఉద్దేశంతో తన పేరిట ఛానల్ ని ప్రారంభించానన్నారు.