ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు

78చూసినవారు
ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు
దాచేపల్లి పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మి దేవిగా ప్రత్యేక అలంకరణలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా మహిళలు వరలక్ష్మి పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. అమ్మవారిని కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

సంబంధిత పోస్ట్