పిడుగురాళ్ల: పేకాట ఆడుతున్న 13 మంది అరెస్ట్

73చూసినవారు
పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి హైవే పక్కన ఓ రెస్టారెంట్లో గురువారం పేకాట స్థావరంపై పిడుగురాళ్ల పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో అక్రమంగా పేకాట ఆడుతున్న 13మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 60, 880 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఎస్ఐ మోహన్ తెలిపారు. ఎవరైనా మండలంలో పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్